Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

షార్ట్స్‌లో చూడండి
*  నయనతార కథానాయికగా ఇటీవల తమిళంలో వచ్చిన 'కొలైయుతీర్ కాలం' చిత్రాన్ని 'వసంతకాలం' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో తెలుగు నాట రిలీజ్ చేస్తారు.
*  తాజాగా సమంతతో 'ఓ బేబీ' హిట్ చిత్రాన్ని రూపొందించిన నందిని రెడ్డి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని 'మహానటి' చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమా అధినేత ప్రియాంక దత్ నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  దర్శకుడు మారుతి బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితం తన దర్శకత్వంలో వచ్చిన 'మహానుభావుడు' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు మారుతి తెలిపాడు. కాగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజు పండగే' చిత్రం రూపొందుతోంది.
Go Back to Shorts
Nayanatara
Samantha
Nandini Reddy
Maruti

More Telugu News