Harish Rawat: కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ కు గుండెపోటు... పరిస్థితి ఆందోళనకరం!

  • డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి తరలింపు
  • ఐసీయూలో ఉంచి చికిత్స
  • వాకబు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డెహ్రాడూన్ లోని మాక్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స జరుగుతోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. రావత్ ఆరోగ్య పరిస్థితిపై సోనియా గాంధీ సహా, పలువురు కాంగ్రెస్ నేతలు ఉత్తరాఖండ్ రాష్ట్ర నాయకులను వాకబు చేశారు.

మరోవైపు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఉత్తరాఖండ్ 7వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, గతంలో కేంద్ర జలవనరుల మంత్రిగానూ పనిచేశారు.
Harish Rawat
Dehradun
Hospital
Max

More Telugu News