Sye Raa Narasimha Reddy: ఆ నిలువెత్తు ఫొటోలో వున్నది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాదు: హీరో చిరంజీవి
హైదరాబాద్ లో ‘సైరా’ చిత్రం సక్సెస్ మీట్ ఈరోజు నిర్వహించారు. ఈ మీట్ కు దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రముఖ హీరో చిరంజీవి, నటులు సాయిచంద్, రవి కిషన్, ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. తమ వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫొటోను చూసి అందరూ ఆయనే అని అనుకుంటున్నారని, అది ఊహాజనిత చిత్రం మాత్రమే అని చెప్పారు.
మీసాలతో ఉండే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిలువెత్తు ఫొటోలో వున్నది ఆయన కాదు, ఆయన మనవడు అని అన్నారు. ఈ విషయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులకు చెందిన ఓ వర్గం వారు తమకు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోలికల్లోనే ఆయన మనవడు ఉంటాడని చెప్పి, ఆ వేషధారణ వేసి ఆ నిలువెత్తు ఫొటోను అప్పట్లో తీశారని, అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫొటోగా ప్రాచుర్యం పొందిందని వారు తమకు చెప్పారని చిరంజీవి పేర్కొన్నారు.