cm: సీఎం కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • కేసీఆర్ కుటుంబం ఓ దండుపాళ్యం ముఠా 
  • అడ్డగోలుగా వ్యవహరిస్తే పర్యవసానం తప్పదు
  • హరీశ్ రావు కూడా ఆ ముఠాకే చెందుతాడు
సీఎం కేసీఆర్ కుటుంబంపై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం ఓ దండుపాళ్యం ముఠాలా తయారైందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తే, అధికారం కోల్పోయాక ఆ పర్యవసానం అనుభవించక తప్పదని విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు బయటకొస్తే ఆయనకు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘వాళ్లంతా ఒకటే.. దండుపాళ్యం ముఠానే’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు

cm
kcr
congress
Revanth Reddy
Harish Rao

More Telugu News