Rajinikanth: ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్మాత కలైజ్ఞానంకు ఇల్లు కొనిచ్చిన రజనీకాంత్

  • రజనీని సోలో హీరోగా పరిచయం చేసిన కలైజ్ఞానం
  • అనామకుడిలా జీవిస్తున్న ఆనాటి నిర్మాత
  • కలైజ్ఞానం పరిస్థితి పట్ల చలించిపోయిన రజనీ
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అలనాటి నిర్మాత, రచయిత కలైజ్ఞానం దయనీయ పరిస్థితి గురించి తెలుసుకుని సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతగానో చలించిపోయారు. కలైజ్ఞానం ఇప్పటికీ అద్దె ఇళ్లలో, ఎంతో సాదాసీదాగా జీవిస్తున్నారని తెలియడంతో ఆయనకో సొంతి ఇంటిని ఏర్పరచాలని అదే వేదికపై నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని సభాముఖంగా కూడా ప్రకటించారు.

కెరీర్ మొదట్లో విలన్ వేషాలు, ఇద్దరు ముగ్గురు హీరోల్లో ఒకరిగా పాత్రలు పోషించిన రజనీని తొలిసారి సోలో హీరోగా పరిచయం చేసింది కలైజ్ఞానమే. 1978లో వచ్చిన భైరవి చిత్రంతో రజనీకాంత్ హీరోయిజం అందరికీ తెలిసింది. తనకు అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చిన కలైజ్ఞానం ఇప్పుడు ఓ అనామకుడిలా జీవిస్తున్నాడన్న విషయాన్ని రజనీ భరించలేకపోయారు.

అందుకే తన మాట నిలబెట్టుకుంటూ ఓ చక్కని నివాసాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. చెన్నైలో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహించగా, రజనీకాంత్ విచ్చేశారు. కలైజాన్ఞం, ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. కాగా, ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
Rajinikanth
Kalaignanam
House
Chennai

More Telugu News