Chintamaneni Prabhakar: చింతమనేనిని వదలని కేసులు... మరోసారి అరెస్టు

  • ఓ వ్యక్తిని నిర్బంధించి కొట్టారంటూ అభియోగాలు
  • చింతమనేనిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధింపు
టీడీపీ నేత, దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇటీవలే దళితులను దూషించిన కేసులో అరెస్టయిన చింతమనేని ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే, 2018లో పెదవేగిలో మురళీకృష్ణ అనే వ్యక్తిని నిర్బంధించి దాడిచేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు చింతమనేనిని ఎక్సైజ్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఈయనకు ఈ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది.  
Chintamaneni Prabhakar
Telugudesam
Police

More Telugu News