KL Rahul: ప్రియురాలితో వచ్చి కెమెరాకు చిక్కిన క్రికెటర్ కేఎల్ రాహుల్!

షార్ట్స్‌లో చూడండి
గత కొంతకాలంగా బాలీవుడ్ నటి అతియా శెట్టితో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వస్తుండగా, తాజాగా వాటిని నిజం చేస్తూ, ఈ జంట కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ కు వీరిద్దరూ డిన్నర్ డేట్ కు వచ్చారు. దీంతో వీరిద్దరి మధ్యా ప్రేమాయణం సాగుతుందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. రాహుల్, అతియాలతో పాటు బాలీవుడ్ నటుడు పంచోలీ, ఆకాంక్షల జంట కూడా కనిపించింది.

కాగా, తమ మధ్య ఉన్న సంబంధంపై ఇప్పటివరకూ అటు రాహుల్ గానీ, ఇటు అదియాలు గానీ ఇంతవరకూ ఏమీ చెప్పలేదు.  ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్, గతంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్ లతోనూ చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
KL Rahul
Adiya
Mumbai
Dinner
Lovers
Dating

More Telugu News