Andhra Pradesh: అధికారుల పొరపాటు.. రెండు సార్లు ప్రమాణం చేసిన ఏపీ చీఫ్ జస్టిస్

  • చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జితేంద్ర కుమార్
  • ప్రమాణస్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్ కు బదులు మధ్యప్రదేశ్
  • రెండో సారి ప్రమాణం చేయించిన గవర్నర్
అధికారులు చేసిన ఓ పొరపాటుకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణస్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్ బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్, చీఫ్ జస్టిస్ ఇద్దరూ మధ్యప్రదేశ్ అనే చదివారు. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ అంటూ చీఫ్ జస్టిస్ తో గవర్నర్ మరోసారి ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యారు.
Andhra Pradesh
Chief Justice
Oath

More Telugu News