Pakistan: పాకిస్థాన్ ను మరోసారి తప్పుబట్టిన ఎఫ్ఏటీఎఫ్

  • ఉగ్రవాదంపై కంటి తుడుపు చర్యలను తీసుకుంటోంది
  • సయీద్ పై కఠిన చర్యలను తీసుకోలేదు
  • భద్రతామండలి నిబంధనలను పక్కన పెట్టింది
ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్)-ఎపీజీ ఇప్పటికే పాకిస్థాన్ పై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నారన్న కారణాలతో ఇప్పటికే పాకిస్థాన్ ను గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్టులో చేర్చింది. ఉగ్రవాదంపై తీసుకోవాల్సిన 40 రకాల చర్యల్లో 32 నిబంధనలు అనుగుణంగా లేవని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేత తదితర కీలకమైన 11 అంశాల్లో లక్ష్యాలను పాకిస్థాన్ చేరుకోలేదని విమర్శించింది.

తాజాగా, పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ మరోసారి విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదంపై కేవలం కంటి తుడుపు చర్యలను మాత్రమే తీసుకుంటోందని వ్యాఖ్యానించింది. హఫీజ్ సయీద్ పై కఠిన చర్యలను తీసుకోలేదని దుయ్యబట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిబంధనలను పక్కనబెట్టిందని విమర్శించింది. ఈ మేరకు ఓ నివేదికలో పాక్ అంశాన్ని ప్రస్తావించింది.
Pakistan
FATF
Terrorism
UNO

More Telugu News