Taliban: తాలిబన్ల చెరలో ఉన్న భారతీయ ఇంజినీర్ల విడుదలకు మార్గం సుగమం!

  • గత ఏడాది మే నెలలో భారతీయ ఇంజినీర్లను అపహరించిన తాలిబన్లు
  • తాలిబన్లు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చలు
  • ఇంజినీర్ల విడుదలకు అంగీకారం 
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల చెరలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజినీర్ల విడుదలకు మార్గం సుగమం అయింది. నిన్న తాలిబన్ ప్రతినిధులు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ ముగ్గురు ఇంజినీర్ల కోసం 11 మంది తాలిబన్లను అమెరికా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా విడుదల చేయబోతున్న వారిలో తాలిబన్ ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం.

అయితే, దీనిపై ఇంత వరకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2018 మే నెలలో భారత ఇంజినీర్లను తాలిబన్లు అపహరించారు. వీరిలో ఒకరిని గత మార్చిలో విడుదల చేశారు. మిగిలిన ముగ్గురు ఇప్పటికీ తాలిబన్ల చెరలోనే ఉన్నారు. తాజాగా వీరితో పాటు, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఇద్దరిని కూడా విడిచిపెట్టేందుకు తాలిబన్లు అంగీకరించినట్టు తెలుస్తోంది.
Taliban
USA
India
Engineers
Afghanistan

More Telugu News