Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్

షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై భారత క్రికెటర్ల విమర్శలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం(యూఎన్‌జీఏ)లో ఇమ్రాన్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మాజీ సారథి సౌరవ్ గంగూలీ వంటివారు మండిపడ్డారు. తాజాగా, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా వారి సరసన చేరాడు.

గొప్ప క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ ఇప్పుడు పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కార్ఖానాగా మారిందని ఆరోపించాడు. ఉగ్రవాదుల విషయంలో పాక్ తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు. యూఎన్‌జీఏలో ఇమ్రాన్ చేసిన ప్రసంగం వింటే ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో ఇమ్రాన్ కీలుబొమ్మగా ఎలా మారిందీ అర్థమవుతుందని కైఫ్ పేర్కొన్నాడు.
Go Back to Shorts
Pakistan
UNGA
mohammad kaif
imran khan

More Telugu News