tsrtc: సమ్మెను అణచివేస్తామని హెచ్చరించడం ఎంతమాత్రమూ సరికాదు: బీజేపీ చీఫ్ లక్ష్మణ్ హెచ్చరిక

  • ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ కఠిన వైఖరి
  • సమ్మెను విరమింపజేసేలా చూడాలన్న లక్ష్మణ్
  • ఫాంహౌస్ నిర్ణయాలు వద్దని హితవు
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. అణచివేత ధోరణి సరికాదని అన్నారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమింపజేయాలని సూచించారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా సమ్మెను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. ఫాంహౌస్ నిర్ణయాలను ప్రజలపై రుద్దొద్దని లక్ష్మణ్ హితవు పలికారు.
 


tsrtc
KCR
Telangana
laxman
BJP

More Telugu News