Andhra Pradesh: ఏపీ క్యాపిటల్ ఆకాశంలో కట్టుకుంటే ఏ సమస్యా ఉండదు: సీపీఐ నారాయణ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతి ఒక కులానికో, వర్గానికో సంబంధించినదిగా ఉండకూడదు కనుకనే దీనిపై ఆలోచన చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అలా అయితే, ఐడియల్ గా ఉండాలంటే, ఆకాశంలో క్యాపిటల్ కట్టుకుంటే ఏ సమస్యా ఉండదని సెటైర్లు విసిరారు. ఎక్కడ రాజధాని నిర్మించినా సమస్య వస్తుంది, పొలాలు లేని గ్రామాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏపీలో పాలన రివర్స్ గేర్ లో నడుస్తోందని విమర్శించారు.
Go Back to Shorts
Andhra Pradesh
amaravathi
cpi
Narayana

More Telugu News