Telangana: తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

  • ఆటపాటలతో మార్మోగుతున్న ట్యాంక్ బండ్
  • ఎల్బీ స్టేడియం - ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మల ర్యాలీ
  • వందలాది బతుకమ్మలను పేర్చిన మహిళలు
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మొదలైన జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ పాటలు మార్మోగుతున్నాయి.

కొమ్ము, కోయ, గుస్సా నృత్యాలతో కళాకారులు ఆకట్టుకుంటున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో వందలాది బతుకమ్మలను మహిళలు పేర్చారు. ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలకు సీఎం కేసీఆర్ భార్య, ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు.
Telangana
warangal
Hyderabad
Batukamma

More Telugu News