Jagan: జగన్ నవరత్నాలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి

  • టీటీడీ నుంచి దుర్గమ్మకు సారె
  • ఆనవాయితీ అని తెలిపిన వైవీ
  • బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వెల్లడి
ఏపీ సీఎం జగన్ నవరత్నాలు పేరిట ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలకు బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ తరుఫున దుర్గమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని వైవీ వెల్లడించారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు.
Jagan
TTD
YV Subba Reddy
Andhra Pradesh
Vijayawada

More Telugu News