Tsrtc: టీఎస్సార్టీసీ సమ్మెపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

  • హైకోర్టులో హౌస్ పిటిషన్ దాఖలు
  • ప్రయాణికుల ఇబ్బంది దృష్ట్యా సమ్మె విరమించుకోవాలి
  • పిటిషన్ లో కోరిన పిటిషనర్ 
టీఎస్సార్టీసీ సమ్మెపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. కుందన్ బాగ్ లోని హైకోర్టు జడ్జి నివాసానికి లాయర్లు బయలు దేరి వెళ్లారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ సమ్మె విరమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఇదిలా ఉండగా, ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రవాణాశాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Tsrtc
Strike
High Court
house motion
petetion

More Telugu News