F2: గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపికైన ఎఫ్2 సినిమా

  • సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఎఫ్2
  • బాక్సాఫీసు వద్ద సందడి
  • ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక
  • హర్షం వ్యక్తం చేసిన అనిల్ రావిపూడి, దిల్ రాజు
తెలుగులో సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఎఫ్2 చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన ఈ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం ఇప్పుడు మరో గౌరవం దక్కించుకుంది. గోవాలో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎఫ్2 చిత్రం కూడా ఎంపికైంది. ఈసారి టాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతున్న ఏకైక తెలుగు చిత్రం ఇదే. దీనిపై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు.

ఇతర భాషా చిత్రాలతో పోటీకి మన తెలుగు చిత్రం కూడా బరిలో ఉండడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం రావడాన్ని ఓ కానుకగా భావిస్తున్నామని తెలిపారు. ఎఫ్2 చిత్రాన్ని అందలం ఎక్కించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వారు సోషల్ మీడియాలో స్పందించారు.
F2
Venkatesh
Varun Tej
Tollywood
Goa

More Telugu News