praja chaitanya yatra: ఏపీలో త్వరలో ప్రజా చైతన్యయాత్ర నిర్వహిస్తాం: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఈ చైతన్య యాత్ర
  • రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర ఉంటుంది
  • కుల వివక్ష, దాడుల నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
ఏపీ వ్యాప్తంగా త్వరలో ప్రజా చైతన్యయాత్ర నిర్వహిస్తామని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపే లక్ష్యంతో ప్రజా చైతన్యయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ఈ చైతన్యయాత్ర ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వివక్షను నిరసించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎస్సీలపై వివక్ష కొనసాగుతోందని అన్నారు. కుల వివక్ష, దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై వివక్ష, దాడి ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
praja chaitanya yatra
Dokka
Manikya vara prasad

More Telugu News