RRR: 'ఆర్ఆర్ఆర్' టైటిల్ సీక్రెట్ లీక్!

  • పరిశీలనలో 'రామ రౌద్ర రుషితం' టైటిల్'
  • ఇతర భాషల్లో 'రైజ్ రివోల్ట్ రివెంజ్'
  • టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి 'ఆర్ఆర్ఆర్' అన్న వర్కింగ్ టైటిల్ ను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సరిపోయే టైటిల్ ను చెప్పాలని ఫ్యాన్స్ ను రాజమౌళి కోరగా, ఎన్నో టైటిల్స్ వచ్చాయి.

వచ్చే సంవత్సరం వేసవిలో జూలై 30న ఈ సినిమా విడుదలకు సిద్ధంకాగా, చిత్ర టైటిల్ కు సంబంధించిన ఓ లీక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అన్న టైటిల్ ను రాజమౌళి సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇక ఇతర భాషల కోసం 'రైజ్ రివోల్ట్ రివెంజ్' అన్న టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
RRR
Rajamouli
Ramcharan
NTR

More Telugu News