Hyderabad: భార్య పరువు తీయాలని భర్త చేసిన నీచం... అరదండాలు!

షార్ట్స్‌లో చూడండి
తనతో గొడవ పడుతున్న భార్య పరువు తీయాలని భావించిన ఓ వ్యక్తి, నీచపు పనికి ఒడిగట్టి, కటకటాల పాలయ్యాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కుషాయిగూడలోని రాధికా థియేటర్ లో ప్రొజెక్టర్ ను ఆపరేట్ చేసే జాన్ జార్జ్ అనే వ్యక్తి, భార్యతో కలిసి లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే భార్య గొడవ పడుతూ ఉండటంతో, ఆమెపై పగ తీర్చుకోవాలని భావించాడు.

భార్య, తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను సేకరించి, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ, దానిలో కనిపిస్తున్న వారంతా కాల్ గర్ల్స్ అని వాయిస్ ఇచ్చాడు. భార్య సెల్ ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాధితురాలికి ఫోన్ల మీద ఫోన్లు రావడం మొదలయింది. ఆ వేధింపులు తట్టుకోలేక పోయిన ఆమె, రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు, ఈ ఘటన వెనకున్నది జాన్ జార్జేనని తేల్చి, శనివారం నాడు అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Hyderabad
Cyber Crime
Arrest
Call Girl
Husbend
Wife

More Telugu News