Jagan: ఢిల్లీ పర్యటనలో జగన్ వెన్నంటే కనిపించిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి!

  • నిన్న ఢిల్లీలో పర్యటించిన జగన్
  • ప్రధానితో వివిధ అంశాలపై చర్చలు
  • ఏపీకి డిప్యూటేషన్ కోరుకుంటున్న శ్రీలక్ష్మి
శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఢిల్లీలో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటన్నర పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటన ఆసాంతం తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కనిపించారు. జగన్ ప్రధాని నివాసానికి వెళ్లేటప్పుడు, సమావేశం అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా కాన్వాయ్‌ లోనే శ్రీలక్ష్మి కనిపించారు.

కాగా, తెలంగాణ కేడర్‌ కు చెందిన శ్రీలక్ష్మి, ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా కొన్ని నెలలు జైల్లోనూ గడిపిన సంగతి తెలిసిందే. తాను ఏపీలో డిప్యుటేషన్ పై పనిచేసేందుకు అనుమతించాలన్న ఆమె అభ్యర్థనను కేసీఆర్ అంగీకరించినా, కేంద్ర డీవోపీటీ ( సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం) మాత్రం డిప్యుటేషన్ ఇంకా ఇవ్వలేదు.
Jagan
New Delhi
Sri Lakshmi
Narendra Modi

More Telugu News