Bigg Boss: 'బిగ్ బాస్'... ఈ వారం మహేశ్ విట్ట అవుట్!
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ 3వ సీజన్ లో 10వ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో సోషల్ మీడియా చెప్పేసింది. ఈ వారంలో మహేశ్ విట్ట హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారని ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎపిసోడ్ లను ముందుగానే చిత్రీకరిస్తూ ఉండటంతో ఏ వారంలో ఎవరు అవుట్ కాబోతున్నారో ముందుగానే లీక్స్ వచ్చేస్తున్నాయి. ఈ వారానికి వరుణ్ సందేశ్, పునర్నవి, రాహుల్ ,మహేశ్ లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.