Prime Minister: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

  • సుమారు గంటకు పైగా కొనసాగిన సమావేశం
  • ‘రైతు భరోసా’ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీకి ఆహ్వానం
  • ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరిన జగన్
ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఏపీలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ మోదీని జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మోదీని కోరారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దుపై మోదీకి జగన్ వివరించినట్టు సమాచారం.

విభజన హామీల అమలు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్టు తెలుస్తోంది. కాగా, మోదీతో భేటీ అనంతరం బయటకొచ్చిన జగన్ ని మీడియా పలకరించింది. అయితే, మీడియాతో జగన్ మాట్లాడకుండానే వెళ్లిపోయారు..
Prime Minister
Narendra Modi
cm
jagan

More Telugu News