cm: జగన్ స్వార్థం వల్లే ఏపీ అంధకారమైంది: టీడీపీ నేత కళా వెంకట్రావు

  • పవన, సౌర విద్యుత్తు రూ.3 నుంచి రూ.4 కే లభ్యమవుతోంది
  • రూ.11.68 కు థర్మల్ విద్యుత్తు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు?
  • ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ స్వార్థం వల్లే ఏపీ అంధకారమైందని విమర్శించారు. పవన, సౌర విద్యుత్తు రూ.3 నుంచి రూ.4 కే లభ్యమవుతున్నా రూ.11.68 కు థర్మల్ విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

సొంత పవర్ ప్లాంట్ ద్వారా రూ.4.84 కు కర్ణాటకకు విద్యుత్తును అమ్ముతున్న జగన్, రాష్ట్రం పట్ల ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. తక్కువ ధరకు కేంద్రం కేటాయించిన బొగ్గును తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయకుండా, తెలంగాణలో సింగరేణి కాలరీస్ నుంచి ఓపెన్ మార్కెట్ లో ఎక్కువ ధరకు బొగ్గును కొనుగోలు చేయడం ద్వారా టన్నుకు రెండు వేల రూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నారని, అయినప్పటికీ ఏపీలో కరెంట్ లేదని విమర్శించారు. ఈ విషయమై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని, ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చే కథనాలకు సీఎం జగన్ స్పందించడం లేదని విమర్శించారు.
cm
jagan
Telugudesam
Kalavenkat rao
YSRCP

More Telugu News