Rahul Gandhi: 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కేసు పెట్టడం పట్ల రాహుల్ గాంధీ స్పందన

  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్
  • మోదీపై వ్యాఖ్యలు చేస్తే జైలు తప్పేట్టులేదని కామెంట్
  • దేశం నియంతృత్వం దిశగా వెళుతోందని వ్యాఖ్యలు
ప్రస్తుతం మనదేశం నియంతృత్వ పాలనవైపు అడుగులేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మైనారిటీలు, దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కేసు పెట్టడం పట్ల రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే మోదీపై ఎవరు వ్యాఖ్యలు చేసినా జైలుకెళ్లక తప్పేట్టులేదని వ్యాఖ్యానించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఏదో ఒక రూపంలో వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రసార సాధనాలు స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి లేదని అన్నారు.
Rahul Gandhi
Narendra Modi
Congress
BJP

More Telugu News