YSRCP: జగన్ కోట్లు మింగుతుంటే, గ్రామ వాలంటీర్లు దసరా మామూళ్లు మొదలెట్టారు: నారా లోకేశ్

  • ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా!’
  • ‘రివర్స్ టెండరింగ్’తో జగనన్న కోట్లు మింగుతున్నాడు
  • పెన్షనర్ల దగ్గర దసరా మామూళ్ల పేరిట వాలంటీర్లు దోపిడీ ప్రారంభించారు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతల విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, టీడీపీ నేత నారా లోకేశ్ జగన్ పై మరోమారు ఆరోపణలు గుప్పించారు. ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా!’ అన్నట్లు,  వైఎస్ జగన్ అన్న రివర్స్ టెండరింగ్ పేరుతో కోట్లు మింగుతున్నాడని ఆరోపించారు.

‘మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం అనుకున్నారో ఏమో గ్రామ వాలంటీర్లు.. పెన్షనర్ల దగ్గర దసరా మామూళ్ల పేరుతో దోపిడీ మొదలుపెట్టారు’ అని ఆరోపించారు. మూడు వేల రూపాయలు ఇస్తానన్న హామీని జగన్ ఎలాగూ నిలబెట్టుకోలేదని విమర్శించారు. పైగా, పెంచిన రూ.250 పింఛన్ ని మామూళ్ల కింద గ్రామ వాలంటీర్లకే కట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రన్న పాలనలో ప్రజలకు పండగ కానుకలు అందాయని, మరి, నేడు జగన్  పాలనలో పండగలు వస్తే ప్రభుత్వానికి ప్రజలే శిస్తు కట్టాల్సి వస్తోందని విమర్శించారు.
YSRCP
cm
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News