YSRCP: నువ్వు, మీ తుగ్లక్ ప్యాంటు తడుపుకుంటున్నారెందుకు?: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫైర్

  • ‘అసభ్య దూషణలుంటే ‘ఫేస్ బుక్’ కి ఫిర్యాదు చెయ్యాలా?
  • సిగ్గూలజ్జా లేని బ్రతుకుల జాబితాలో ‘గిన్నిస్’కు ఎక్కారు
  • పత్రికా విలువల గురించి నువ్వు మాట్లాడటమా!
ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తూ చేసిన వరుస ట్వీట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్లలో వారిపై ధ్వజమెత్తారు. ‘సిగ్గు, లజ్జా లేని బ్రతుకుల జాబితాలో నువ్వు, మీ తుగ్లక్ వైఎస్ జగన్ గిన్నిస్ బుక్ లో ఎక్కారుగా శకుని మామా! 16 నెలల జైలు జీవితం గడిపిన సిగ్గుమాలిన నువ్వు పత్రికా విలువల గురించి మాట్లాడటం, మీ నల్ల పేపర్, నికృష్టపు ఛానెల్ గురించి గొప్పలు చెప్పుకోవడం..’ అంటూ విమర్శలు చేశారు. ‘అనాగరిక పోస్టులకు, అసభ్యకరమైన రాతలకు తండ్రి అయిన నువ్వు సోషల్ మీడియా విలువలు గురించి మాట్లాడటం కంటే దారుణం ఇంకోటి ఉంటుందా?’ అని ప్రశ్నించారు.

‘అసభ్య దూషణలుంటే ‘ఫేస్ బుక్’ కి ఫిర్యాదు చెయ్యాలా? మరి నువ్వు, మీ తుగ్లక్ జగన్ ప్యాంటు తడుపుకుంటున్నారెందుకు? ఎలాంటి అనాగరిక దూషణలు లేకుండానే టీడీపీ కార్యకర్తలు పెడుతున్న పోస్టులకు వణుకు పుట్టి దొంగ కేసులు పెట్టి అరెస్టు చేసే అవసరం ఎందుకొచ్చిందో చెప్తావా శకుని మామా?’ అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.  
YSRCP
mp
vijayasaireddy
Telugudesam
Budha

More Telugu News