Chandrababu: మీ బానిస మీడియా ఎంత దాచిపెట్టినా సోషల్ మీడియా మీ అరాచకాలను బయటపెట్టిందనేనా ఈ ఏడుపు?: విజయసాయిరెడ్డి

  • వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం
  • తీవ్రంగా స్పందించిన విజయసాయి
  • మీ పుత్రరత్నం పెట్టిన ట్వీట్లేమైనా సుమతీశతకాలా అంటూ వ్యాఖ్యలు
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ తమపై దారుణంగా ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేసిన మరుసటిరోజే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచిపెట్టినా మీ అరాచకాలన్నింటినీ సోషల్ మీడియా బయటపెట్టిందనేనా ఈ ఏడుపు! అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ పైనా, జగన్ గారి పైనా నీచపు రాతలు రాసేందుకు వేలమందిని నియమించి 24/7 కాల్ సెంటర్లను నిర్వహించింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబుగారూ! అంటూ విజయసాయి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.

సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పోస్టులు పెట్టుకుంటారని, మీకు నచ్చకపోతే ఎఫ్ బీ కి ఫిర్యాదు చేయొచ్చని హితవు పలికారు. చంద్ర'జ్యోతి' ఎంత చిచ్చు పెట్టాలని చూసినా లాభం లేకుండా పోయిందన్నదే సారు అసలు బాధ అంటూ ఎద్దేవా చేశారు. అయినా మీ పుత్రరత్నం పెట్టిన ట్వీట్లేమైనా సుమతీ శతకాల్లా అనిపిస్తున్నాయా? అని విజయసాయిరెడ్డి నిలదీశారు.

"సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లే ఫస్టుంటాయి. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పనిసరిగా ఉంటాడు. వీళ్లు జన్మలో మారరు. వీళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు నిర్వచనాలు వేరే ఉంటాయి" అంటూ మండిపడ్డారు.
Chandrababu
Vijay Sai Reddy
Telugudesam
YSRCP
Nara Lokesh
Jagan

More Telugu News