SBI: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు షాక్‌ : ఇకపై మైక్రో ఏటీఎంల్లో ఒక్కసారే విత్‌డ్రా సదుపాయం

  • ఇప్పటి వరకు మూడుసార్లు అవకాశం
  • అదనంగా వినియోగిస్తే బాదుడే
  • అతిపెద్ద బ్యాంకు నిర్ణయంతో ఖాతాదారుల్లో ఆందోళన 
దేశీయంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు షాకిచ్చాయి. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించాయి. నెలకు ఒక్కసారి మాత్రమే ఇతర బ్యాంకుల మైక్రో ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించాయి. ఇప్పటి వరకు ఈ అవకాశం మూడుసార్లు ఉండేది. ఇది ఖాతాదారులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం. ప్రభుత్వ డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌లో భాగస్వామ్యం కాని ఖాతాదారులు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
SBI
micro ATMs
only one time per month

More Telugu News