Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు

  • 'సైరా' ఘన విజయం నేపథ్యంలో చిరుని కలిసిన గంటా
  • అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపానంటూ ట్వీట్
  • బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న 'సైరా'
మెగాస్టార్ చిరంజీవిని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా గంటా పంచుకున్నారు. 'సైరా' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో అన్నయ్య చిరంజీవిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పారు. వెండి తెరపై తొలి స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను చూపించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరోవైపు 'సైరా' చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. హిందీ వెర్షన్ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది.
Chiranjeevi
Ganta Srinivasa Rao
Sye Raa Narasimha Reddy
Tollywood

More Telugu News