Kadapa District: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

  • బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులు
  • చూసి వస్తుండగా కేశాపురం వద్ద లారీని ఢీకొట్టిన కారు
  • మృతులను కడప వాసులుగా గుర్తించిన పోలీసులు
కడప జిల్లా చిన్నమండెం మండలంలోని కేశాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న కారు కేశాపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాద స్థలంలో మరణించిన వారిని కడపకు చెందిన హర్షవర్ధన్, బుజ్జి, భూదేవిగా గుర్తించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa District
Road Accident
bengaluru
Andhra Pradesh

More Telugu News