Tik Tok: ఆమెను టిక్ టాక్ ఓ స్టార్ ను చేస్తే... బీజేపీ 'ఎమ్మెల్యే టికెట్' ఇచ్చింది!

  • వీడియోలతో పేరుతెచ్చుకున్న సోనాలీ ఫోగాట్
  • టిక్ టాక్ లో లక్ష మంది ఫాలోవర్లు
  • ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న సోనాలీ
టిక్ టాక్ యాప్ లో 1000 మంది ఫాలోవర్స్ ఉంటేనే చోటా మోటా స్టార్ గా గుర్తింపు లభిస్తుంది. అలాంటిది లక్ష మంది ఫాలోవరు ఉంటే సూపర్ స్టారే. హర్యానాకు చెందని సోనాలీ ఫోగాట్ కూడా టిక్ టాక్ లో లక్షమంది ఫాలోవర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. సోనాలీ వీడియోలకు టిక్ టాక్ లో ఎంతో పాప్యులారిటీ ఉంది. ఆమె ఇమేజ్ ను ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఏకంగా ఆమెకు ఆదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చింది. ఆదంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ బలం సోనాలీకి ఎంతమేర సహకరిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Tik Tok
Sonali Phogat
BJP
Congress
Haryana

More Telugu News