Chandrababu: అధికారులూ జాగ్రత్త!... శాంతిభద్రతల కోసం గతంలో మా పార్టీ వాళ్లనే జైలుకు పంపా: చంద్రబాబు హెచ్చరిక

  • భవిష్యత్ నాశనం చేసుకోవద్దంటూ హితవు
  • గతంలో అనేకమంది అధికారులు జైలుకెళ్లారని వ్యాఖ్యలు
  • అతిగా ప్రవర్తించవద్దంటూ అధికారులు, పోలీసులకు స్పష్టీకరణ
ఏపీ విపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్ర పోలీసులకు, అధికారులకు విస్పష్టమైన హెచ్చరికలు చేశారు. పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గమనించాలని హితవు పలికారు. గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లారని, అధికారులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. శాంతిభద్రతల కోసం గతంలో తమ పార్టీ నేతలనే జైలుకు పంపానని చంద్రబాబు వెల్లడించారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలని హితవు పలికారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News