Chandrababu: జోహార్ చంద్రబాబు అంటారా... రాజకీయాల్లోకి వచ్చింది ఇలాంటి వెధవ మాటలు వినడానికా?: చంద్రబాబు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
తనపైనా, తన పార్టీ నేతలపైనా వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం దారుణం అంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. చింతమనేని ప్రభాకర్ పై పెట్టిన పలు పోస్టులను చంద్రబాబు మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. స్టేషన్ లో వేసి కుమ్మేశారు, చూడండి ఎలా దీనంగా కూర్చున్నాడో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారని వెల్లడించారు. ఆపై తనపైనే పెట్టిన మరో పోస్టుకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

స్వర్గస్తులైన నారా చంద్రబాబునాయుడు అంటూ పోస్టు చేశారని, నువ్వు ఎన్ని లుచ్ఛా పనులు చేసినా, పైకి పోయావు కాబట్టి సానుభూతి ప్రదర్శిస్తున్నాం, జోహార్ చంద్రబాబు అంటూ కామెంట్ పెట్టారని మండిపడ్డారు. "మేమంతా రాజకీయాల్లో ఉన్నది ఇలాంటి వెధవ పనులు, వెధవ మాటలు వినడానికా?" అంటూ మండిపడ్డారు. ఇవి కొన్నిమాత్రమేనని, వాళ్లు చేసినవన్నీ డీజీపీకి ఇచ్చామని, కానీ డీజీపీకి అవేమీ కనిపించడంలేదని విమర్శించారు. వీటితో పాటు నారా లోకేశ్ పై పెట్టిన పలు పోస్టులను కూడా చంద్రబాబు ప్రదర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh
YSRCP
Telugudesam

More Telugu News