Sunny Leone: సమాజసేవకు సిద్ధమైన సన్నీ లియోన్ 

షార్ట్స్‌లో చూడండి
పోర్న్ స్టార్ గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఆ కెరీర్ కు ముగింపు పలికిన సన్నీ లియోన్... ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతోంది. క్రేజీ స్టార్ గా కొనసాగుతున్న సన్నీకి మానవత్వం కూడా ఎక్కువే. 2017లో సన్నీలియోన్ దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. గత ఏడాది సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు సన్నీ తల్లి అయింది. తాజాగా సమాజసేవకు సన్నీ నడుం బిగించింది. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తనవంతు కృషిని ప్రారంభించింది. క్యాన్సర్ బారిన పడినవారిని కాపాడేందుకు సిద్ధమైంది. దీనికోసం విరాళాలను కూడా సేకరించబోతున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు భారత్ లోని దాదాపు అన్ని భాషల్లో సన్నీ నటిస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడు 'మోతీచూర్ ఛుక్నాచూర్' అనే సినిమాలో నటిస్తోంది. దీని తర్వాత ఏక్తా కపూర్ నిర్మించబోయే 'కామసూత్ర'లో నటించనుంది.
Go Back to Shorts
Sunny Leone
Bollywood
Cancer
Social Work

More Telugu News