cash bag: ఆహారం అనుకుని డబ్బు సంచి ఎత్తుకెళ్లిన కోతి!

  • సంచిలో 57 వేల రూపాయల నగదు
  • బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తుండగా ఎత్తుకు వెళ్లిన కోతి
  • ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఘటన
ఊహించని సంఘటన ఇది. ఆకలితో నకనకలాడుతున్న ఓ వానరం ఆ దారిలో వెళ్తున్న వ్యక్తి చేతిలో సంచి గమనించింది. అందులో ఏదైనా ఆహార పదార్థం ఉండి ఉంటుందని ఊహించిన వానరం అవకాశం కోసం చూస్తోంది. ఇంతలో ఆ వ్యక్తి చేతిలోని బ్యాగును పక్కన ఉంచి మరో పని చూస్తుండడంతో కోతి ఆ సంచి పట్టుకుని వుడాయించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బదాయూలో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన వివరాల్లోకి వెళితే...ఓ వ్యక్తి బ్యాంకులో జమ చేయాల్సిన 57 వేల రూపాయలను బ్యాగులో పెట్టి తీసుకు వెళ్తున్నాడు. ఇతని చేతిలో బ్యాగును గమనించిన వానరం అతను బ్యాగు పక్కనపెట్టి మరో పనిలో ఉండగా దాన్ని ఎత్తుకెళ్లింది.

బ్యాగుతో సహా సమీపంలోని చెట్టు ఎక్కి కూర్చుంది. అనంతరం బ్యాగు తెరిచి అందులో ఏమైనా తినుబండారాలు ఉన్నాయేమోనని వెతికింది. ఏమీ కనిపించక పోవడంతో అందులో ఉన్న నోట్లను బయటకు తీసి విసిరేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన బ్యాగు యజమాని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమిగూడారు.

కోతి విసిరేసిన నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. చాలా మంది తమకు దొరికిన నోట్లను ఆ వ్యక్తికే తిరిగి అప్పగించగా, కొందరు మాత్రం చేతివాటం ప్రదర్శించారు. దీంతో అనుకున్న మొత్తం కంటే కొంత తగ్గింది.
cash bag
monkey
run with bag
food expect

More Telugu News