Nara Lokesh: మీ పాలనలో దళితులను ఎదగనివ్వరా?... నారా లోకేశ్ ధ్వజం

  • ట్విట్టర్ లో లోకేశ్ వ్యాఖ్యలు
  • ఓ దళిత ఎమ్మెల్యే వీడియోను ట్వీట్ చేసిన లోకేశ్
  • రాష్ట్రంలో మిగిలిన దళితుల పరిస్థితి ఏంటని ఆవేదన
గాంధీ జయంతి నాడు మద్యం అమ్మకాలు చేయించినవారు, చికెన్, మటన్ లతో సంబరాలు చేసుకున్న వారి నుంచి గాంధీజీ కోరుకున్న సమసమాజ నిర్మాణం ఆశించడం అత్యాశే అవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. లక్షలమంది ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ఓ దళిత ఎమ్మెల్యేని సేవ చేయనివ్వకుండా చేతులు కట్టేస్తారా? అంటూ ప్రశ్నించారు. మీ పాలనలో దళితులను ఎదగనివ్వరా? అంటూ మండిపడ్డారు.

 ఈ ట్వీట్ తో పాటు ఓ దళిత ఎమ్మెల్యే తనను స్వేచ్ఛగా ప్రజాసేవ చేయనివ్వడంలేదంటూ ఆవేదన వెలిబుచ్చుతున్న వీడియోను కూడా జత చేశారు. గాంధీ జయంతి నాడే ఓ దళిత ఎమ్మెల్యే తనపై వివక్ష చూపిస్తున్నారని బాధపడుతున్నారంటే, రాష్ట్రంలో మిగిలిన దళితుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Nara Lokesh
YSRCP
Telugudesam

More Telugu News