Buddha Venkanna: శకుని మామా, నిన్ను జగన్ హెచ్చరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి!: విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు

  • ట్విట్టర్ లో మాటల యుద్ధం
  • విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు
  • హైపర్ టెన్షన్ ఎక్కువైందంటూ సెటైర్లు
ఎన్నికలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న, విజయసాయిరెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.

"శకుని మామా, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ తో పాటు హైపర్ టెన్షన్ కూడా నీకే ఎక్కువైందని తాడేపల్లిలో, ఢిల్లీలో కూడా అనుకుంటున్నారు. నిన్ను రాష్ట్ర వ్యవహారాల్లో వేలుపెట్టవద్దని జగన్, మన దగ్గరికి రానివ్వకండి అని అమిత్ షా తేల్చిచెప్పారని మీ పార్టీ నేతల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి" అని బుద్ధా వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిసి ఫ్రస్ట్రేషన్లో ట్వీట్లు పెడుతున్న నువ్వు, కాంట్రాక్టర్ల నుంచి  కమిషన్ మొత్తం జగనే నొక్కేస్తున్నాడని ఎంత బాధపడుతున్నావో తెలుస్తోందిలే! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Buddha Venkanna
Vijay Sai Reddy
Jagan
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News