Tamilnadu: తిరుచ్చి లలితా జ్యుయెలరీ దుకాణంలో భారీ దోపిడీ

  • గోడకు కన్నం వేసిన దొంగలు
  • రూ.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాల చోరీ
  • సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆభరణాల సంస్థగా పేరుగాంచిన లలితా జ్యుయెలరీలో దొంగలు పడ్డారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న లలితా జ్యుయెలరీ బ్రాంచిలో  గోడకు కన్నమేసి షాపులో చొరబడిన దొంగలు 35 కేజీల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు ఆభరణాల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

చోరీకి ముందు దొంగలు రెక్కీ చేసినట్టు నిర్ధారించారు. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ దోపిడీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్టు తెలుసుకున్నారు. వారు ముసుగులు ధరించి ఉన్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు షురూ చేశారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు.
Tamilnadu
Lalitha Jewellery
Gold
Diamonds

More Telugu News