Twitter: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ట్విట్టర్... లాగిన్ చేస్తే ఎర్రర్ మెసేజ్!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం నుంచి ట్విట్టర్ నిలిచిపోయింది. లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీనిపై ట్విట్టర్ నుంచి వివరణ వచ్చింది. లోపం ఎక్కడుందో కనుక్కుని, దాన్ని పరిష్కరించే పనిలో తమ నిపుణులు తలమునకలై ఉన్నారని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ట్విట్టర్ వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 4000కి పైగా రిపోర్టులు ట్విట్టర్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా, జపాన్, కెనడా, భారత్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Twitter
Social Media

More Telugu News