Vijayasai Reddy: శ్మశానాలకు రంగులు వేసుకునే శకుని మామా.. నువ్వా మాట్లాడేది?: బుద్ధా వెంకన్న

  • గోదావరిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంత మంది ఉన్నారు?
  • ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది?
  • రూ. 25 లక్షల నష్టపరిహారం ఎప్పుడు ఇస్తున్నారు?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. గోదావరి నదిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో బోటు వెళ్లడానికి అనుమతించిన మీ మంత్రి ఎవరని అడిగారు. ఇప్పటి వరకు ఎంత మంది మృత దేహాలను వెలికి తీశారని, ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రశ్నించారు.

గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ ప్రభుత్వానిదే అని వెంకన్న ఎద్దేవా చేశారు. గతంలో మీరే డిమాండ్ చేసిన విధంగా... గోదావరిలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 25 లక్షల నష్ట పరిహారాన్ని ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని... దీనికి బాధ్యతగా మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని అడిగారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే శకుని మామా... నువ్వా చంద్రబాబుగారి గురించి మాట్లాడేది? అని అన్నారు.
Vijayasai Reddy
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News