సరిహద్దులో విషాదం.. వరద ఉద్ధృతికి పాక్ వైపు కొట్టుకుపోయిన భారత జవాను మృతి
- గత నెల 28న పెట్రోలింగ్ నిర్వహిస్తూ కాలువలో పడి కొట్టుకుపోయిన జవాను
- మూడు రోజుల గాలింపు తర్వాత మృతదేహం లభ్యం
- అధికారిక లాంఛనాలతో భారత్‌కు అప్పగించనున్న పాక్ సైన్యం
చివరికి మూడు రోజుల తర్వాత నిన్న పాక్ భూభాగంలో పరితోశ్ మృతదేహాన్ని పాక్ సైన్యం గుర్తించింది. బీవోపీ ఆక్టోరాయ్ వద్ద పరితోశ్ మృతదేహాన్ని పూర్తి లాంఛనాలతో భారతదేశానికి అందజేయనున్నారు. పరితోశ్‌ది పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా. తన తోటి సైనికులను కాపాడిన పరితోశ్ ప్రాణత్యాగం చేశారని, అంకితభావం కలిగిన సైనికుడిని కోల్పోవడం దురదృష్టకరమని జమ్మూ బీఎస్ఎఫ్ ఐజీ విచారం వ్యక్తం చేశారు.