TRS: కాంగ్రెస్ మునిగిపోతున్న నావ... బీజేపీ, టీడీపీలకు ప్రజల నుంచి స్పందన ఉండదు: కేటీఆర్

  • హుజూర్ నగర్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్
  • ప్రచార ఇన్ చార్జ్ లతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
  • కాంగ్రెస్ కు మరో ఘోరపరాభవం తప్పదని వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రాభవం తగ్గుతోందన్న విమర్శల నేపథ్యంలో సత్తా చాటాలని టీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూర్ నగర్ ప్రచార ఇన్ చార్జ్ లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీలకు ప్రజల నుంచి స్పందన ఉండదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని, అలాంటి పార్టీకి ప్రజలెందుకు ఓట్లేస్తారు? అంటూ వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ అభివృద్ధిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నవి అబద్ధాలని ఆరోపించారు. కాంగ్రెస్ కు మరో ఘోరపరాభవం తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న కలిసి పోటీచేసి, నేడు విడిగా కలబడుతున్న విపక్షాల అనైక్యతను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
TRS
KTR
Congress
Telugudesam
BJP
Huzur Nagar

More Telugu News