TRS: హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతాం!: సీపీఐ నారాయణ

  • ఆసక్తికరంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక
  • టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయం
  • ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ క్రమంలో సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమతో సరిగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలిసివచ్చే పార్టీలను సమన్వయం చేయడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలం అయ్యారని నారాయణ ఆరోపించారు. సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో వారికి మద్దతు ఇవ్వలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతామని స్పష్టం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు సీపీఐ ముఖ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ దోస్తీ స్పష్టమైంది.
TRS
CPI Narayana
Huzur Nagar
Telangana

More Telugu News