Jagan: భారతీయత ఆత్మ పల్లెల్లోనే ఉందన్న మహాత్ముడి పలుకులే మాకు ఆదర్శం: సీఎం జగన్

  • గాంధీజీకి జగన్ నివాళి
  • బాపూ బోధనల స్ఫూర్తిగా పాలన సాగిస్తామని ప్రతిన
  • గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేస్తున్నామని ఉద్ఘాటన
అక్టోబరు 2న జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బాపూజీ బోధనలే స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. బాపూజీ 150 జయంతి వేళ ఆయన స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని, గ్రామస్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ద్వారా నెరవేర్చుతున్నామని తెలిపారు. భారతీయత ఆత్మ పల్లెల్లోనే ఉందన్న గాంధీజీ పలుకులే తమకు ఆదర్శం అని వ్యాఖ్యానించారు. రైతులు, పేదలు, బలహీనవర్గాల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

మద్యపాన నిషేధంలో భాగంగా 4 నెలల్లోనే 43 వేల మద్యం బెల్టు షాపులను మూసివేశామని వెల్లడించారు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా 4,380 నుంచి 3,500కి తగ్గించామని జగన్ చెప్పుకొచ్చారు.
Jagan
Andhra Pradesh
Gandhi

More Telugu News