DK Shivakumar: డీకే శివకుమార్ కస్టడీని పొడిగించిన ఢిల్లీ హైకోర్టు

  • జ్యుడీషియల్ కస్టడీని 15 వరకు పొడిగించిన హైకోర్టు
  • తీహార్ జైల్లో డీకేను ప్రశ్నించేందుకు ఈడీకి అనుమతి
  • ఈనెల 4, 5 తేదీల్లో ప్రశ్నించేందుకు అనుమతి
మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కస్టడీని ఈనెల 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. శివకుమార్ కస్టడీని పొడిగించాలన్న ఈడీ విన్నపానికి కోర్టు సమ్మతించింది. తీహార్ జైల్లో ఆయనను ప్రశ్నించేందుకు అనుమతించింది. ఈనెల 4, 5 తేదీల్లో ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలపై శివకుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు.

DK Shivakumar
Congress
Delhi High Court
ED

More Telugu News