Rajani: 'చంద్రముఖి'లో ఆ షాట్ ని రజనీ సార్ అప్పటికప్పుడు అనుకుని చేశారు: హీరో వినీత్

  • నా కెరియర్లో మరిచిపోలేని సినిమా 'చంద్రముఖి'
  • రజనీ సార్ తో కలిసి నటించడం అదృష్టం
  • 'చంద్రముఖి' తనకి మంచి పేరు తెచ్చిందన్న వినీత్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరో వినీత్ మాట్లాడుతూ 'చంద్రముఖి' సినిమాను గురించి ప్రస్తావించారు. "రజనీకాంత్ తో కలిసి తెరపై కనిపిస్తే చాలని ఎంతోమంది ఆర్టిస్టులు అనుకుంటూ వుంటారు. 'చంద్రముఖి' సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం నాకు రావడం అదృష్టం. నా కెరియర్లో మరిచిపోలేని సినిమా ఇది.

ఈ సినిమాలో గుణశేఖర్ - చంద్రముఖి నాట్యం చేస్తుండగా రాజుగా వున్న రజనీసార్ వచ్చి కత్తితో గుణశేఖర్ తలను నరికేస్తాడు. స్క్రిప్టులో ఇంతవరకే వుంది. అయితే కిందపడిన గుణశేఖర్ తలను తన కాలితో కెమెరా వైపు తన్నడమనేది రజనీసార్ అప్పటికప్పుడు అనుకుని చేసింది. ఆ తరువాత ఆ షాట్ ఉంచాలా? తీసేయాలా? అనే చర్చ కూడా జరిగింది. 'చంద్రముఖి' పాత్ర పట్ల సానుభూతి పెరగాలంటే, ఆమె ప్రియుడి తలను తన్నే షాట్ వుంచడమే మంచిదనే అభిప్రాయాన్ని రజనీ సార్ వ్యక్తం చేయడంతో అలాగే ఉంచేశారు" అని చెప్పుకొచ్చాడు.
Rajani
Vineeth

More Telugu News