Sye Raa Narasimha Reddy Movie: 'సైరా'కు తొలగిన అడ్డంకులు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • సినిమా విడుదలను ఆపలేమన్న హైకోర్టు
  • సినిమాను సినిమాలాగే చూడాలంటూ వ్యాఖ్య
  • సినిమా చూడాలా, వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'సైరా' చిత్రాన్ని తొలుత బయోపిక్ అన్నారని, ఆ తర్వాత కాదంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల అభీష్టంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. సినిమాను సినిమాలాగే చూడాలని చెప్పింది.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని... విడుదలకు ఒక రోజు ముందు సినిమాను ఆపలేమని తెలిపింది. హైకోర్టు తీర్పుతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. రేపు 'సైరా' చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.
Sye Raa Narasimha Reddy Movie
Chiranjeevi
Release
High Court
Tollywood

More Telugu News