Guntur District: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తకు విషమిచ్చి చంపేందుకు భార్య కుట్ర.. పసిగట్టిన భర్త!

షార్ట్స్‌లో చూడండి
వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తనను అడ్డుతొలగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించిన భర్త తెలివిగా తప్పించుకున్నాడు. సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుడు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

తన భార్య పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను మందలించాడు. గుట్టు రట్టు కావడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె తిరిగి భర్త, అతని కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

కాగా, తనపై కేసుపెట్టిన భార్య.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో హైదరాబాద్, గుంటూరు తిరుగుతూ లాడ్జీల్లో బస చేస్తున్న విషయం తెలుసుకున్న బాధితుడు వారిపై ఓ కన్నేసి ఉంచాడు. తనకున్న పరిచయాలతో వేరే వ్యక్తుల ద్వారా వారు ఏకాంతంగా గడిపిన వీడియోలు, వారి ఫోన్ కాల్ సంభాషణకు సంబంధించిన రికార్డింగులను సేకరించాడు.

వారి సంభాషణలో తనకు విషం పెట్టి చంపేందుకు చేసిన ప్లాన్ గురించి విని విస్తుపోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి తాను సేకరించిన ఆధారాలను వారికి అప్పగించి తనకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నాడు.
Go Back to Shorts
Guntur District
sattenapalli
Andhra Pradesh
wife
husband

More Telugu News