Botsa Satyanarayana: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంలో భాగంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు: బొత్స

  • ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుతున్నారని వెల్లడి
  • ప్రతిపక్షం విమర్శలు చేసినా ముందుకెళుతున్నామని వ్యాఖ్యలు
  • ఉద్యోగాలకు ఎంపికైన వారు నిబద్ధతతో పనిచేయాలని సూచన
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనలో భాగంగానే సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన హామీలను సీఎం నెరవేర్చుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకెళ్తున్నాం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ అందరినీ భాగస్వామ్యం చేశాం, కొత్తగా ఉద్యోగాలు పొందినవారంతా నిబద్ధతతో పనిచేయాలి అని సూచించారు. విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
Jagan
YSRCP
Vijayawada

More Telugu News